![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -369 లో..... మాణిక్యం ఇంటినుండి రామలక్ష్మి ని తీసుకొని వస్తాడు సీతాకాంత్. తన అమ్మ నాన్న ప్రేమ చూసి ఎమోషనల్ అవుతుంది. ఏంటి వాళ్లు మీ అమ్మ నాన్ననా అని సీతాకాంత్ అనగానే.. లేదు కానీ నాకు చిన్నప్పటి నుండి అమ్మనాన్న లేరు.. వాళ్ళు అలా ప్రేమ చూపించగానే నేను కనెక్ట్ అయ్యానని రామలక్ష్మి అంటుంది. నీ బిహేవియర్ చూస్తుంటే రామలక్ష్మి అనిపిస్తుంది. అలా చెప్పేలోపే కాదు మైథిలీ అంటున్నావని సీతాకాంత్ అనుకుంటాడు.
రామలక్ష్మి ఇంటికి సంతోషంగా వెళ్తుంది. నీ ఆనందానికి కారణం ఏంటని ఫణీంద్ర అడుగుతాడు. మా అమ్మనాన్నలని కలిసాను.. పైగా వాళ్ళ పెళ్లి రోజు దగ్గర ఉండి జరిపించానని రామలక్ష్మి హ్యాపీగా ఫీల్ అవుతుంది. జరిగింది మొత్తం ఫణీంద్ర, సుశీల ఇద్దరికి రామలక్ష్మి చెప్తుంది. సీతాకాంత్ కావాలనే నిన్ను అక్కడికి తీసుకొని వెళ్ళాడు నీకు రామలక్ష్మి అని ఉచ్చు బిగిస్తున్నాడు.. ఇక నువ్వు రామలక్ష్మిగా ఉంటావో లేక మైథిలీగా ఉంటావో నువ్వే తేల్చుకో అని ఫణీంద్ర అంటాడు. అవును సీతా సర్ కావాలనే చేస్తున్నాడు. నేను మైథిలీగానే ఉంటానని రామలక్ష్మి అనుకుటుంది.
మరొకవైపు శ్రీలత పంతులు గారిని పిలిపిస్తుంది. అప్పుడే సీతాకాంత్ వస్తాడు. నీకు రమ్యకి పెళ్లి ముహూర్తం పెట్టాడానికి అని శ్రీలత అంటుంది. నాకు వద్దని చెప్పాను కదా అని సీతాకాంత్ అంటాడు. నన్ను స్వామి పంపాడని పంతులు చెప్తాడు. మీ జీవితంలో రెండు పెళ్లిళ్లు ఉన్నాయ్.. పెళ్లి చేసి పిల్లలతో కుటుంబంతో హ్యాపీగా ఉండమని అతను చెప్తాడు. ఏదైనా ఉంటే మళ్ళీ కాల్ చేస్తామని పంతులిని పంపిస్తాడు. నాకు పెళ్లి వద్దని శ్రీలతతో గొడవ పెట్టుకుంటాడు సీతాకాంత్. దాంతో శ్రీలత కోపంగా సీతాకాంత్ ని తీసుకొని మైథిలి దగ్గరికి వెళ్తుంది. నీ మనవరాలు నా కొడుకు జీవితం ప్రశాంతంగా లేకుండా చేస్తుందని ఫణీంద్రతో శ్రీలత గొడవపడుతుంది. నీ కొడుకే నా మనవరాలు వెంట పడుతున్నాడని శ్రీలతతో ఫణీంద్ర అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |